తెలుగు

ఈ డౌన్‌లోడ్ సేవకు మీ పరికరం మద్దతు ఇవ్వనప్పటికీ, డౌన్‌లోడ్ సమాచారాన్ని వీక్షించడానికి దీన్ని ఉపయోగించవచ్చు. కంప్యూటర్‌పై డౌన్‌లోడ్ కోసం డౌన్‌లోడ్‌ల లింక్‌లను ఇ-మెయిల్ ద్వారా పంపబవచ్చు.

COOLPIX B500 ఫర్మ్‌వేర్

మీ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంచుకోండి.

 • Windows
 • Mac OS

ఈ సాఫ్ట్‌వేర్ నవీకరణ ప్రోగ్రామ్ ఎగువ జాబితా చేయబడిన వినియోగదారు కలిగి ఉన్న పరికరం కోసం (“ప్రభావిత ఉత్పత్తి”), మరియు దిగువ జాబితా చేసిన ఒప్పందాన్ని ఆమోదిస్తే మాత్రమే అందించబడుతుంది. “ఆమోదించాను” ఎంచుకుని, “డౌన్‌లోడ్ చేయి” క్లిక్ చేయడం ద్వారా, మీరు ఒప్పందంలోని నిబంధనలు మరియు షరతులను ఆమోదించినట్లు పరిగణించబడుతుంది. డౌన్‌లోడ్ చేయడానికి ముందు ఒప్పందంలోని నిబంధనలు అర్థం చేసుకున్నట్లు నిర్ధారించుకోండి.

 • • COOLPIX B500 కెమెరాల నుంచి సంస్కరణ 1.5 వరకు ఫర్మ్‌వేర్ అప్‌డేట్ చేయడానికి ఉపయోగించబడే సాఫ్ట్‌వేర్‌ను ఈ సేవ సరఫరా చేస్తుంది. కొనసాగే ముందు, కెమెరా అమర్చు మెనులో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను ఎంచుకోండి మరియు కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి. పైన జాబితా చేయబడిన ఫర్మ్‌వేర్ ఇప్పటికే వ్యవస్థాపించినట్లయితే మీకు ఈ అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ లేదా సంస్థాపించనవసరం లేదు.
 • • ఈ నవీకరణలో మునుపటి నవీకరణలలో చేసిన అన్ని మార్పులను కలిగి ఉంటుంది.
 • • కొనసాగే ముందు కింది సమాచారాన్ని చదవండి.

ముఖ్యమైనది

కెమెరా అంతర్గత మెమొరీలో నిల్వ చేసిన ఇమేజ్‌లు ఫర్మ్‌వేర్ నవీకరించబడినప్పుడు తొలగించబడతాయి. ఫర్మ్‌వేర్‌ను నవీకరించే ముందు కెమెరా అంతర్గత మెమొరీలోని నిల్వ చేసిన ఇమేజ్‌లను బ్యాకప్ చేయాలని నిర్ధారించుకోండి. ఇమేజ్‌లను అంతర్గత మెమరీ నుండి మెమొరీ కార్డ్‌కు కాపీ చేయడంపై సూచనల కోసం కెమెరా మార్గదర్శక పుస్తకంను చూడండి.

ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.4తో పోల్చితే 1.5లో మార్పులు
 • • కింది సమస్య పరిష్కరించబడింది:
  • - వినియోగదారులు iOS 13కి సంబంధించిన SnapBridge అప్లికేషన్ ఉపయోగించి స్మార్ట్ పరికరంతో కెమెరాను జతపరచడానికి ప్రయత్నించినప్పుడు, జతపరచడం విఫల్యంతో ముగుస్తుంది మరియు ఆ ప్రభావం యొక్క సందేశం ప్రదర్శించబడుతుంది.
మునుపటి సంస్కరణలతో పోల్చితే మార్పులు
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.3తో పోల్చితే 1.4లో మార్పులు
 • • కెమెరా ఆన్ చేసినప్పుడు ప్రదర్శించబడే లెన్స్ హెచ్చరిక మార్చబడింది.
 • • కొన్ని నిర్దిష్ట చర్యలు చేసేటప్పుడు కొత్త ఫోల్డర్‌ను సృష్టించడానికి మరియు DSCN0001.JPG నుండి తిరిగి ప్రారంభించడానికి ఫైల్ నంబరింగ్‌కు కారణం అయ్యే సమస్యను పరిష్కరించబడింది.
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.1తో పోల్చితే 1.3లో మార్పులు
 • • అమర్చు > సమయ మండలి మరియు తేదీ > సమయ మండలి ఉప-మెనులో హోం సమయ మండలి లేదా ప్రయాణ గమ్యం ఎంచుకున్నప్పుడు ప్రదర్శన ఇప్పుడు ప్రస్తుతం ఎంచుకున్న మండలిలో ప్రధాన నగరాల పేర్లను మాత్రమే చూపుతుంది.
ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.0తో పోల్చితే 1.1లో మార్పులు
 • • SnapBridge యొక్క iOS సంస్కరణ కొరకు మద్దతు జోడించబడింది.
 • • కొంత సహాయ వచనం నవీకరించబడింది.
కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను వీక్షించడం
 1. లెన్స్ మూతను తీసివేసి, కెమెరాను ఆన్ చేయండి.
 2. మెనులను ప్రదర్శించడానికి కెమెరా MENU బటన్‌ను నొక్కండి.
 3. పట్టిక ప్రతిమలను ప్రదర్శఇంచడానికి బహుళ ఎంపిక సాధనంను ఎడమకు నొక్కండి, ఆపై అమర్చు హైలైట్ చేసి, OK ను నొక్కండి.
 4. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను హైలైట్ చేసి, కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను ప్రదర్శించడానికి OK ను నొక్కండి.
 5. కెమెరా ఫర్మ్‌వేర్ సంస్కరణను తనిఖీ చేయండి.
 6. కెమెరా ఆఫ్ చేయండి.
ఉత్పత్తి వివరణ
పేరు COOLPIX B500 ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.5
మద్దతు ఉన్న కెమెరాలు COOLPIX B500
మద్దతు ఉన్న ఫర్మ్‌వేర్ సంస్కరణలు సంస్కరణలు 1.0–1.4
ఫైల్ పేరు F-B500-V15W.exe
ఆపరేటింగ్ సిస్టమ్
 • Microsoft Windows 10 హోమ్
 • Microsoft Windows 10 ప్రో
 • Microsoft Windows 10 సంస్థ
 • Microsoft Windows 8.1
 • Microsoft Windows 8.1 ప్రో
 • Microsoft Windows 8.1 సంస్థ
గమనిక: కార్డ్ రీడర్ లేదా కంప్యూటర్‌తో అంతర్నిర్మిత మెమరీ కార్డ్ స్లాట్ అవసరం.
కాపీరైట్ నికాన్ కార్పొరేషన్
ఆర్కైవ్ రకం స్వీయ-సంగ్రహణ
పునరుత్పత్తి అనుమతి లేదు
కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
 1. కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లో ఒక ఫోల్డర్‌ను రూపొందించండి మరియు దానికి కావలసిన పేరు పెట్టండి.
 2. దశ 1లో రూపొందించిన ఫోల్డర్‌కు F-B500-V15W.exe డౌన్‌లోడ్ చేయండి.
 3. కొత్త ఫోల్డర్‌లో ఒక ఉప-ఫోల్డర్‌ను సంగ్రహించడానికి F-B500-V15W.exe అమలు చేయండి. ఫలిత ఫైల్ మరియు ఫోల్డర్ క్రమానుగతం కింద చూపించబడ్డాయి:
  • firmware (ఉప-ఫోల్డర్ కలిగి ఉన్న ఫర్మ్‌వేర్‌)
  • firmware.bin ("firmware‌" ఫోల్డర్‌లో గుర్తించబడ్డ, కెమెరా ఫర్మ్‌వేర్‌)
 4. కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చేయబడిన మెమరీ కార్డ్‌కు "firmware" ఫోల్డర్‌ను కాపీ చేయండి.
  గమనిక: "firmware" ఫోల్డర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
 5. మెమొరీ కార్డ్‌ను కెమెరాలోకి చొప్పించి, లెన్స్ మూతని తీసివేసి, కెమెరాను ఆన్ చేయండి.
 6. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
 7. ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
 8. ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.

గమనిక: మేము ఫర్మ్‌వేర్‌ను నవీకరించే ముందు కెమెరా అంతర్గత మెమొరీలో నిల్వ చేయబడిన చిత్రాలను బ్యాకప్ చేయమని మీకు సిఫార్సు చేస్తున్నాము. చిత్రాలను అంతర్గత మెమొరీ నుండి మెమొరీ కార్డ్‌కి కాపీ చేయడానికి సంబంధించిన సమాచారం కోసం కెమెరా మార్గదర్శక పుస్తకంను చూడండి.

గమనిక: అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి అవసరమున్న ఉపకరణ గురించి వివరణాత్మక సూచనలు లేదా సమాచారం కోసం, కింది pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి:
CPX_MS_FirmUp_Win_En.pdf (PDF) (0.17 MB)

గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.

ఉత్పత్తి వివరణ
పేరు COOLPIX B500 ఫర్మ్‌వేర్ సంస్కరణ 1.5
మద్దతు ఉన్న కెమెరాలు COOLPIX B500
మద్దతు ఉన్న ఫర్మ్‌వేర్ సంస్కరణలు సంస్కరణలు 1.0–1.4
ఫైల్ పేరు F-B500-V15M.dmg
ఆపరేటింగ్ సిస్టమ్
 • macOS Catalina వెర్షన్ 10.15
 • macOS Mojave వెర్షన్ 10.14
 • macOS High Sierra వెర్షన్ 10.13
 • macOS Sierra వెర్షన్ 10.12
 • OS X 10.11.6
 • OS X 10.10.5
 • OS X 10.9.5
 • OS X 10.8.5
 • OS X 10.7.5
 • Mac OS X 10.6.8
గమనిక: కార్డ్ రీడర్ లేదా కంప్యూటర్‌తో అంతర్నిర్మిత మెమరీ కార్డ్ స్లాట్ అవసరం.
కాపీరైట్ నికాన్ కార్పొరేషన్
ఆర్కైవ్ రకం స్వీయ-సంగ్రహణ
పునరుత్పత్తి అనుమతి లేదు
కెమెరా ఫర్మ్‌వేర్‌ను అప్‌డేట్ చేయడం
 1. F-B500-V15M.dmg డౌన్ లోడ్ చేయండి.
 2. కింది ఫోల్డర్ మరియు ఫైల్‌ను కలిగిన డిస్క్ చిత్రాన్ని మౌంట్ చేయడానికి F-B500-V15M.dmg చిహ్నాన్ని రెండు-సార్లు నొక్కండి:
  • firmware (ఉప-ఫోల్డర్ కలిగి ఉన్న ఫర్మ్‌వేర్‌)
  • firmware.bin ("firmware‌" ఫోల్డర్‌లో గుర్తించబడ్డ, కెమెరా ఫర్మ్‌వేర్‌)
 3. కార్డ్ స్లాట్ లేదా కార్డ్ రీడర్‌ను ఉపయోగించి, కెమెరాలో ఫార్మాట్ చేయబడిన మెమరీ కార్డ్‌కు "firmware" ఫోల్డర్‌ను కాపీ చేయండి.
  గమనిక: "firmware" ఫోల్డర్‌ను మెమొరీ కార్డ్ యొక్క రూట్ (అత్యంత-ఎగువ) డైరెక్టరీలోకి కాపీ చేయాలని నిర్ధారించుకోండి. ఒకవేళ ఇది రూట్ డైరెక్టరీ దిగువన ఉన్న ఫోల్డర్‌లో పెట్టినట్లయితే కొత్త ఫర్మ్‌వేర్‌ను కెమెరా గుర్తించదు.
 4. మెమొరీ కార్డ్‌ను కెమెరాలోకి చొప్పించి, లెన్స్ మూతని తీసివేసి, కెమెరాను ఆన్ చేయండి.
 5. అమర్చు పట్టికలో ఫర్మ్‌వేర్ సంస్కరణ ను ఎంచుకోండి మరియు ఫర్మవేర్ నవీకరణను పూర్తి చేయడానికి ఆన్-స్క్రీన్ సూచనలను పాటించండి.
 6. ఒక సారి అప్‌డేట్ పూర్తి అయిన తర్వాత, కెమెరా ఆఫ్ చేసి, మెమరీ కార్డ్‌ను తీసివేయండి.
 7. ఫర్మ్‌వేర్ కొత్త సంస్కరణకు అప్‌డేట్ చేయబడిందని నిర్ధారించండి.

గమనిక: మేము ఫర్మ్‌వేర్‌ను నవీకరించే ముందు కెమెరా అంతర్గత మెమొరీలో నిల్వ చేయబడిన చిత్రాలను బ్యాకప్ చేయమని మీకు సిఫార్సు చేస్తున్నాము. చిత్రాలను అంతర్గత మెమొరీ నుండి మెమొరీ కార్డ్‌కి కాపీ చేయడానికి సంబంధించిన సమాచారం కోసం కెమెరా మార్గదర్శక పుస్తకంను చూడండి.

గమనిక: అప్‌డేట్‌ను పూర్తి చేయడానికి అవసరమున్న ఉపకరణ గురించి వివరణాత్మక సూచనలు లేదా సమాచారం కోసం, కింది pdf ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయండి:
CPX_MS_FirmUp_Mac_En.pdf (PDF) (0.14 MB)

గమనిక: మీ కొరకు అప్‌డేట్‌లు నికాన్-అధీకృత సేవా ప్రతినిధి ద్వారా చేయబడుతాయి.

తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందం

PDF ఫైళ్లను ఉచిత Adobe® Reader® సాఫ్ట్‌వేర్ ఉపయోగించి చూడవచ్చు.
Adobe® Reader®ను డౌన్‌లోడ్ చేయండి.